సీఎం రమేశ్ ఇంట్లో తనిఖీలు... పోలీసులను అడ్డుకున్న ఎంపీ

First Published 5, Apr 2019, 7:49 AM IST
Police officials raids on TDP MP CM Ramesh House at kadapa
Highlights

టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట్లో సోదాలు చేసేందుకు పోలీసులు రావడం కలకలం రేపింది.

ఎన్నికల వేళ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, అభ్యర్థుల ఇళ్లపై ఐటీ దాడులు జరగడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ క్రమంలో టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఇంట్లో సోదాలు చేసేందుకు పోలీసులు రావడం కలకలం రేపింది.

శుక్రవారం ఉదయం కడప జిల్లా పోట్లదుర్తిలోని సీఎం రమేశ్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు చేరుకున్నారు. వారిని ఎందుకు వచ్చారని ఎంపీ ప్రశ్నించగా.. తనిఖీలు చేసేందుకు వచ్చామని తెలిపారు.

సెర్చ్ వారెంట్ ఉంటేనే లోపలికి పంపిస్తా అని సీఎం రమేశ్ స్పష్టం చేయడంతో ఎంపీకి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేతలను బెదిరించే ధోరణిలో దాడులు

loader