ఏపీ రాష్ట్ర మంత్రి కె. అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో నిన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. 

ఈ ర్యాలీలో అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు కూడా పాల్గొన్నారు. కాగా... ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా అనుమతి తీసుకోకుండా బైక్ ర్యాలీ నిర్వహించారంటూ అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌ నాయుడుతో పాటు 50 మందిపై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.