Asianet News TeluguAsianet News Telugu

సెంటిమెంట్ గెలిచింది: పయ్యావుల గెలిచాడు, టీడీపీ ఓడింది

ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తే....ఆ దఫా రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరం అవుతోంది. ఈ దఫా కూడ అదే సంప్రదాయం కొనసాగింది.

payyavula keshav wins from vuravakonda segment, but tdp lost power in andhra pradesh
Author
Amaravathi, First Published May 24, 2019, 4:49 PM IST

అనంతపురం: ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధిగా పయ్యావుల కేశవ్ విజయం సాధిస్తే....ఆ దఫా రాష్ట్రంలో టీడీపీ అధికారానికి దూరం అవుతోంది. ఈ దఫా కూడ అదే సంప్రదాయం కొనసాగింది.

పయ్యావుల కేశవ్  తండ్రి టీడీపీలో ఉన్నారు. ఎన్టీఆర్ ఏరికోరి కేశవ్ ను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి కేశన్న ఈ స్థానం నుండి విజయం సాధించారు. ఆ సమయంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

1999 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శివరాంరెడ్డి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. కానీ, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేశవ్ తన సమీప సీపీఐఎంఎల్ లిబరేషన్ అభ్యర్థి వై. విశ్వేశ్వర్ రెడ్డిపై 8255 ఓట్లతో విజయం సాధించారు.

2009 ఎన్నికల్లో కూడ మరోసారి ఇదే స్థానం నుండి కేశవ్ టీడీపీ అభ్యర్ధిగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా విశ్వేశ్వర్ రెడ్డిపై 229 ఓట్లతో పయ్యావుల కేశవ్ నెగ్గారు. వరుసగా రెండు దఫాలు కేశవ్ విజయం సాధించినా కూడ ఏపీ రాష్ట్రంలో  టీడీపీ అధికారంలోకి రాలేదు.

2014 ఎన్నికల్లో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది.కానీ, ఈ ఎన్నికల్లో ఉరవకొండ నుండి కేశవ్ విజయం సాధించలేదు. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా విశ్వేశ్వర్ రెడ్డి నెగ్గారు.

2019 ఎన్నికల్లో ఉరవకొండ అసెంబ్లీ స్థానంలో పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. కానీ, ఈ దఫా టీడీపీ మాత్రం అధికారానికి దూరమైంది.

Follow Us:
Download App:
  • android
  • ios