జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే.. పవన్ స్థానికుడు కాదని.. ఏదైనా అవసరం వస్తే.. ఎవరిని అడుగుతారు.. పవన్ ని గెలిపిస్తే మీకే కష్టం అంటూ ప్రత్యర్థులు పవన్ స్థానికతను ప్రచారంలో వాడుకుంటూ వస్తున్నారు. కాగా.. వారి స్థానికత కామెంట్స్ కి పవన్ గట్టి షాక్ ఇచ్చారు.

గాజువాకలోని చినగంట్యాడ శ్రీకృష్ణదేవరాయ నగర్ లో డూప్లెక్స్ గృహాన్ని పవన్ కోసం పార్టీ నేతలు ఎంపిక చేశారు. ఎటువంటి సెక్యురిటీ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ నివాసాన్ని అద్దెకు తీసుకున్నారు.  గాజువాకను సొంత నియోజకవర్గంగా చేసుకునేందుకు పవన్ ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.

శనివారం నుంచి పవన్.. ఈ ఇంటి నుంచే తన కార్యకలాపాలు ప్రారంభించారు. ఇంటిని జనసేన రాష్ట్ర కమిటీ సభ్యులు హరిప్రసాద్, శివశంకర్ లు ముందుగా చూసి ఒకే చేశారు. స్థానిక పోలీసు స్పెషల్ బ్రాంచ్ అధికారులు కూడా ఇంటిని పరిశీలించినట్లు తెలుస్తోంది.