Asianet News TeluguAsianet News Telugu

పవన్ అనూహ్య నిర్ణయం.. మంగళగిరి బరిలో జనసేన

మంగళగిరి అసెంబ్లీ స్థానం ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణ పోటీకి దిగుతున్నారు. 

pawan kalyan shocking decession over mangalagiri constituency
Author
Hyderabad, First Published Mar 25, 2019, 10:01 AM IST

మంగళగిరి అసెంబ్లీ స్థానం ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేస్తుండగా.. వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణ పోటీకి దిగుతున్నారు. కాగా.. ఇప్పుడు జనసేన కూడా రంగంలోకి దిగింది. సోమవారం నామినేషన్లకు ఆఖరి తేదీగా.. ఈ రోజు అనూహ్య నిర్ణయం తీసుకుంది.

పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించిన మంగళగిరి స్థానంలో పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో జనసేన తరఫున చల్లపల్లి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేయనున్నారు. జనసేన పార్టీ.. వామపక్షాలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పొత్తుల్లో భాగంగా ఏడు అసెంబ్లీతో పాటు, రెండు పార్లమెంట్‌ స్థానాలను సీపీఐకి కేటాయించింది.

 ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చడంపై సీపీఐ నేతలు అసంతృప్తికి గురయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ నేతలు జనసేనతో చర్చలు జరిపి సర్దుబాటు చేసుకున్నారు.

తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరి స్థానంలోనూ సీపీఐకి జనసేన ఝలక్‌ ఇచ్చింది. సీపీఐ తరఫున ముప్పాళ్ల నాగేశ్వరరావు నామినేషన్‌ వేసేందుకు సిద్ధమవుతుండగా.. చల్లపల్లి శ్రీనివాస్‌ను జనసేన ప్రకటించింది. బీ-ఫారం కూడా ఇచ్చేసింది. మరి దీనిపై సీపీఐ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios