Asianet News TeluguAsianet News Telugu

నా దగ్గరికి ఎవడు రమ్మన్నాడు: తోట త్రిమూర్తులుపై పవన్ ఫైర్

ఇటీవలే తనను తోట త్రిమూర్తులు కలిశారని స్పష్టం చేశారు. తన దగ్గరకు వచ్చి టీడీపీని బెదిరించి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి తోట త్రిమూర్తులు అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులానికి సేవ చేసే వ్యక్తి తోట త్రిమూర్తులు కాదని కులాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. 

Pawan Kalyan questions Thota Trimurthulu
Author
Kakinada, First Published Apr 8, 2019, 6:43 PM IST

కాకినాడ: రామచంద్రపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. నిన్ను ఎవడు నా దగ్గరకు రమ్మన్నారని నిలదీశారు. 

ఇటీవలే తనను తోట త్రిమూర్తులు కలిశారని స్పష్టం చేశారు. తన దగ్గరకు వచ్చి టీడీపీని బెదిరించి టికెట్ తెచ్చుకున్న వ్యక్తి తోట త్రిమూర్తులు అంటూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులానికి సేవ చేసే వ్యక్తి తోట త్రిమూర్తులు కాదని కులాన్ని నమ్ముకుని పైకి వచ్చిన వ్యక్తి అంటూ ధ్వజమెత్తారు. 

తనను తోట త్రిమూర్తులు  కలిశారని గుర్తు చేశారు. కలిసి ఏమీ మాట్లాడకుండా ఉంటే తానే ఏంటి విషయం అని అడిగానని చెప్పుకొచ్చారు. మీతో రాజకీయాల్లో మార్పు వస్తుందని తోట త్రిమూర్తులు అన్నారని తెలిపారు. 

ఏం చేద్దామనుకుంటున్నారంటే కూడా ఉండి సలహాలు ఇద్దామని అనుకుంటున్నానని తోట త్రిమూర్తులు చెప్పారని గుర్తు చేశారు. తాను 25 ఏళ్లు సినీ ఇండస్ట్రీలో ఉన్నానని ప్రజల పాలసీలను క్షుణ్ణంగా తెలుసుకున్న వాడినని ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన తర్వాత తాను పార్టీ పెట్టానని తనకు ఎవరు సలహాలు వద్దన్నారు. 

పార్టీ నడపడం నాకు చేతకాదా అని నిలదీశారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు రావు పక్కన ఉండి ఏదో చేద్దామనుకుంటే తప్పన్నారు. మీలాంటి వ్యక్తులను తాను నమ్మనన్నారు. రాబోయే ఎన్నికల్లో తోట త్రిమూర్తులను ఓడించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. 

మరోవైపు కాకినాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ పైనా ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. టీడీపీ పల్లకీ మోయ్యాలని అనుకుంటే తనను ఎందుకు కలిశారని తన టైం ఎందుకు వేస్ట్ చేశావంటూ విరుచుకుపడ్డారు. పల్లకీలు మోసే చలమలశెట్టి సునీల్ ను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. 

అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వంగాగీత కచ్చితంగా ఓడిపోతుందన్నారు. ఆమె అంటే అన్నయ్య చిరంజీవికి అభిమానమని అలాంటి వ్యక్తి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరారని ఆరోపించారు. తన అన్నయ్య వీరిని ఆదరిస్తే వీరు మరో గట్టుకు వెళ్లారని ఆమెకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. 

Follow Us:
Download App:
  • android
  • ios