అమరావతి: నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సేవ చేయడమే ప్రజలకు పార్టీ ఇచ్చే కృతజ్ఞత అవుతుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

ఆదివారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో  పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు.పోలింగ్ సందర్భంగా అభ్యర్థులకు ఎదురైన సమస్యలను ఆయన అడిగి తెలుసుకొన్నారు.

పోలింగ్ తర్వాత రెండు పార్టీలు అధికారం మాదేంటే మాదేనని చేస్తున్న ప్రకటనల గురించి ఆయన ప్రస్తావించారు.  పోలింగ్ తర్వాత సరళి గురించి ఎలా ఉందో తెలుసుకోవాల్సిందిగా మాత్రమే పార్టీ నేతలకు చెప్పానని ఆయన గుర్తు చేశారు.

మార్పు మొదలైందని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడ ఇదే తరహా మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయ న చెప్పారు. తెలంగాణలో కూడ ఇదే తరహా మార్పును ప్రజలు కోరుకొంటున్నారిన పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

జనసేనకు అండగా నిలబడిన వారికి ధన్యవాదాలు చెప్పాలని  ఆయన  పార్టీ నేతలకు సూచించారు. స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పనిచేయాలని ఆయన కోరారు.