రాయలసీమ అంటే బాంబులు చుట్టిన నేల అని చెప్పిన నేతలు కనిపించారు కానీ సీమ గొప్పతనాన్ని ఎవరు చెప్పలేదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. రాజమండ్రిలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగించారు.

జనసేనకు బలముంది ఒక్క గోదావరి జిల్లాలే కాదు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఉందన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ ఇక్కడ యువత ఏ మార్పు కోరుకుంటున్నారో, అక్కడి ప్రజలు కూడా అదే మార్పు కోరుకుంటున్నారని పవన్ స్పష్టం చేశారు.

తెలంగాణకు జనసేన అవసరం ఉంటుందని, తెలుగుజాతి ఐక్యత కోసం జనసేన పోరాడుతుందని పవన్ స్పష్టం చేశారు. 2014లో తెలుగుజాతి సుస్థిరత కోసం పోటీ చేశామని, ఈసారి సమతుల్యత కోసం పోటీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

జగన్ లాగా పవన్ బీసీల కోసం మహాసభలు పెట్టదని 32 మందితో విడుదల చేసిన జాబితాలో బీసీలకు అండగా నిలిచామన్నారు. కడప పార్లమెంటు , పులివెందుల టికెట్ల జగన్ బీసీలకు ఇవ్వగలరా అని పవన్ ప్రశ్నించారు.

వైఎస్ కుటుంబాన్ని కాదని మిగిలిన వారికి టికెట్లు ఇవ్వగలరా అని పవన్‌ను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో ఆంధ్రావారిని కమ్మ, కాపు, మాల, మాదిగ అని కాకుండా ఆంధ్రుడిగానే చూశారని నీచాతీనీచంగా ఆంధ్రుల్ని తిట్టారన్నారు.