తన సోదరుడిని రాజకీయాల్లోకి దొడ్డిదారిన కాకుండా.. రాజ మార్గంలో తీసుకువచ్చానని.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాజమార్గంలో తన అన్నయ్యను.. ప్రజాక్షేత్రంలో నిలబెట్టానని ఆయన అన్నారు. ప్రజల తీర్పును తాము గౌరవిస్తామని చెప్పారు. 

బుధవారం నాగబాబు...జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ మీడియాతో మాట్లాడారు. తనలో రాజకీయ చైతన్యం మొదలైంది... తన సోదరుడు నాగబాబు వల్లనే అని చెప్పుకొచ్చారు. తాను వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించగానే నాగబాబు పార్టీలోకి రావడానికి అంగీకరించారని.. అందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

అసలు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తిని ఇప్పుడు తాను రాజకీయాల్లోకి తీసుకువచ్చానని చెప్పుకొచ్చారు. నాగబాబు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అని.. రాజకీయాలపట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వ్యక్తి అని అన్నారు. అందుకే ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్లు చెప్పారు. 

పురం పార్లమెంట్ స్థానానికి జనసేన తరపున పోటీ చేసి దిగ్విజయం సాధిస్తారని బలంగా నమ్ముతున్నానన్నారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చని.. అయితే. ప్రజా క్షేత్రంలో పోటీచేసే వాళ్లకు ఉండే ధైర్యం, తెగింపు అందరికీ ఉండవని చెప్పారు.