అమరావతి:వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థును జనసేన ప్రకటించింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ విడుదల చేసింది.జనసేన వామపక్షాలతో కలిసి ఏపీ రాష్ట్రంలో పోటీ చేయనుంది.

అమలాపురం, రాజమండ్రి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అమలాపురం నుండి డిఎంఆర్ శేఖర్ పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు.  రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి  ఆకుల సత్యనారాయణ పేరును ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆకుల సత్యనారాయణ రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. రెండు మాసాల క్రితం ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్‌బై చెప్పి జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

 

అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు వీరే

 

రాజమండ్రి రూరల్ .కందుల దుర్గేష్

గుంటూరు పశ్చిమ- తోట చంద్రశేఖర్

మమ్మిడివరం-పితాని బాలకృష్ణ 

తెనాలి. నాదెండ్ల మనోహర్

ప్రత్తిపాడు-రావేల కిషోర్ బాబు

పాడేరు-పసుపు లేటి బాలరాజు

కావలి- పసుపు లేటి సుధాకర్,

కాకినాడ రూరల్- పంతం నానాజీ

ఏలూరు-నర్రా శేషు కుమార్ 

తాడేపల్లిగూడెం- బోలిశెట్టి శ్రీనివాసరావు

రాజోలు  రాపాక వరప్రసాద్

పి. గన్నవరం -పాముల రాజేశ్వరి

 ధర్మవరం- మధుసూదన్ రెడ్డి

కడప . సుంకర శ్రీన

కాకినాడ రూరల్-అనిశెట్టి బుల్లబ్బాయ్

తుని-  రాజ అశోక్ బాబు 

మండ పేట- దొమ్మేటి వెంకటేశ్వర్లు

ఈ జాబితాను  జనసేన అధికారికంగా ఇవాళ లేదా రేపు విడుదల చేసే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.32 అసెంబ్లీ స్థానాలకు 7 ఎంపీ స్థానాలకు జనసేన అభ్యర్థులను ఫైనల్ చేసిందని సమాచారం.