అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను దూకుడుగా ఉంటానన్న వ్యాఖ్యలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 

తాను దూకుడుగా ఉంటే వైసీపీ అభ్యర్థిగా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోటీ చెయ్యడని స్పష్టం చేశారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన గత ఐదేళ్లుగా తాము ప్రశాంతంగా ఉంటున్నామని ప్రజల కోసమే పనిచేస్తున్నామని తెలిపారు. 

తాను ఏదైనా చెయ్యాలి అనుకుంటే తన తల్లి పరిటాల సునీత ఐదేళ్లు మంత్రిగా పనిచేశారని అప్పుడే చేసేవాడినని చెప్పుకొచ్చారు. తమ చేతుల్లో అధికారం కూడా ఉందికదా అన్నారు. కానీ తాము ఎలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చెయ్యడం లేదని ప్రజల కోసం చిత్తశుద్దితో పనిచెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన తండ్రి దివంగత నేత పరిటాల రవి ఆశయ సాధనే లక్ష్యంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు.