Asianet News TeluguAsianet News Telugu

పవన్ కి షాక్.. మరో నేత రాజీనామా

ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడగా.. తాజగా మరో నేత పార్టీని వీడారు. 

one more shock to pawan, cricket vijay resigns to janasena
Author
Hyderabad, First Published Apr 4, 2019, 3:52 PM IST

ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడగా.. తాజగా మరో నేత పార్టీని వీడారు. వారం రోజుల కిందటే ఆ నేత జనసేన తీర్థం పుచ్చుకోవడం గమనార్హం.

వారం రోజుల క్రితం విజయ్ కుమార్ అలియాస్ క్రికెట్ విజయ్ జనసేనలో పవన్ సమక్షంలో చేరిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన ఇప్పుడు రాజీనామా చేశారు. తనకు హీరో పవన్‌ కల్యాణ్‌పై ఉన్న అభిమానంతో గతనెల 26వ తేది రేణిగుంట విమానాశ్రయంలో పార్టీలో చేరానని గుర్తుచేశారు.

 ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేసిన తాను ఏ పార్టీల్లోనూ చేరడం లేదన్నారు. ఇప్పటి వరకు తాను చిత్తూరు  జిల్లా క్రికెట్‌ అధ్యక్షుడిగా కొనసాగుతున్నట్టు తెలిపారు. మే 25న ఆంధ్రాక్రికెట్‌ అసోసియేషన్‌కు జరిగే ఎన్నికల్లో జిల్లా అసోసియేషన్‌ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా తాను పోటీ చేయనున్నట్టు తెలిపారు. అందుకని ఏ పార్టీలో సభ్యత్వం ఉండదకూడదనే నిబంధన నేపథ్యంలో రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios