ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కోలుకోలేని దెబ్బ తగిలింది. కేవలం 25సీట్లకే టీడీపీ పరిమితమైంది. ఈ ఎన్నికల్లో జగన్ ప్రభంజనం సృష్టించాడు. అయితే.. ఈ దెబ్బ నుంచి కోలుకోక ముందే.. చంద్రబాబుకి మరో దెబ్బ తగిలింది. టీడీపీ నేత రెడ్డప్ప గారి శ్రీనివాస రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

శ్రీనివాస రెడ్డి కడప జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షులుగా వ్యవహరించారు. కాగా...  ఈ ఎన్నికల్లో జిల్లాలో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ... తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. క్రమశిక్షణగల టీడీపీ కార్యకర్తగా పార్టీ అభివృద్ధి కోసం తాను ఇన్ని రోజులు కృషి చేశానని ఆయన చెప్పారు.  ఈ మేరకు చంద్రబాబు నాయుడికి లేఖ పంపించారు. 

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.