మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతామన్నారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన సోమవారం ఉదయం అమరావతిలో పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెన్షన్ల అర్హత వయస్సును 60 ఏళ్లకే కుదిస్తామని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఇప్పటికీ కేంద్రంపై గట్టిగా మాట్లాడటం లేదని సీఎం ఎద్దేవా చేశారు. కేసీఆర్, మోడీ విషయంలో సాఫ్ట్‌గా ఉండేవారు రాష్ట్ర ద్రోహులేనన్నారు.