అమరావతి: ఏపీ ఐటీ శాఖ మంత్రి, టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు చేయడానికి ముందు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొన్నారు.

ఈ ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాడు. శుక్రవారం నాడు లోకేష్ మంగళగిరిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.నామినేషన్ దాఖలు చేయడానికి ముందుగా అమరావతిలో సీఎం చంద్రబాబు దంపతుల ఆశీర్వాదాన్ని లోకేష్ తీసుకొన్నారు.

లోకేష్‌ను చంద్రబాబు ఆశీర్వదించారు. కొద్దిసేపట్లో లోకేష్ మంగళగిరిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు తరపున టీడీపీ కార్యకర్తలు నామినేషన్ దాఖలు చేయనున్నారు.