హైదరాబాద్: మంత్రిగా తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 120 అవార్డులు తీసుకువచ్చానని తనపై చేస్తున్న వ్యాఖ్యలపై పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు ఏపీమంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్. 

రాష్ట్ర అభివృద్ధి కోసం తాను ఎంతో పాటుపడుతున్నానని అలాంటిది తనను పప్పు అంటూ వ్యాఖ్యానిస్తే తానెందుకు పట్టించుకోవాలని నిలదీశారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పప్పు అన్న వ్యాఖ్యలపై తాను పట్టించుదలచుకోలేదని దాని గురించి మాట్లాడనన్నారు.
 
ప్రజలకు తానేంటో తెలుసునని తాను చేసిన అభివృద్ధి ఏంటో కూడా అంతా గమనిస్తూనే ఉన్నారన్నారు. ఎన్నికల ప్రచారంలో తాను ఏదైనా ఒకపదం తప్పు దొర్లితే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పెద్ద ఇష్యూ చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని గమనిస్తే అందులో కూడా బోలెడు తప్పులు దొర్లుతాయన్నారు. వాటిని తాము పట్టించుకోవాలంటే చాలానే ఉంటాయన్నారు మంత్రి నారా లోకేష్.