నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.  దీంతో.. ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. 


నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో.. ఆయనను కుటుంబసభ్యులు హుటాహుటిన బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచిన ఎస్పీవై రెడ్డి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఈ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయన టికెట్ ఆశించి భంగపండారు. దీంతో.. జనసేన నుంచి ఆయనకు టికెట్ ఆఫర్ చేయడంతో.. ఆయన ఆ పార్టీలోకి జంప్ చేశారు. ప్రస్తుతం జనసేన నుంచే ఆయన ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా.. ఇప్పుడిలా అనారోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలయ్యారు.