Asianet News TeluguAsianet News Telugu

సెల్వమణి కంటే ఆస్తులు ఎక్కువ, కార్లంటే మక్కువ: రోజా ఆస్తులు, అప్పులు ఇవే....

రోజా ఆస్తుల మెుత్తం రూ.7,38,38, 430లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. అయితే ఆమె భర్త సెల్వమణి పేరిట మాత్రం స్థిరాస్థి లేదని స్పష్టం చేశారు. ఇకపోతే ఆమె కుమారుడు కృష్ణ కౌశిక్, కుమార్తె అనూషల పేర్ల మీద రూ.50లక్షల 56వేల 191ల డిపాజిట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. 

 

nagari mla r.k.roja election affidavit
Author
Chittoor, First Published Mar 25, 2019, 3:00 PM IST


చిత్తూరు: నగరి సిట్టింగ్ ఎమ్మెల్యే రోజాకు కార్లంటే మహాఇష్టమని తెలుస్తోంది. ఆమెకు దాదాపు ఏడు కార్లు ఉన్నాయంటే ఆమెకు కార్లు అంటే ఎంత మక్కువో ఇట్టే అర్థమవుతుంది. ఈనెల 22న నగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రోజా ఎన్నికల అఫిడవిట్ లో కోటి రూపాయలు విలువ చేసే ఏడు కార్లను చూపించారు. 

రోజా ఆస్తుల మెుత్తం రూ.7,38,38, 430లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. అయితే ఆమె భర్త సెల్వమణి పేరిట మాత్రం స్థిరాస్థి లేదని స్పష్టం చేశారు. ఇకపోతే ఆమె కుమారుడు కృష్ణ కౌశిక్, కుమార్తె అనూషల పేర్ల మీద రూ.50లక్షల 56వేల 191ల డిపాజిట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. 

రోజా పేరిట ఉన్న ఆస్తుల వివరాలు:
రోజా పేరిట ఉన్న మొత్తం ఆస్తి: రూ.7,38,38,430
స్థిరాస్తి మొత్తం : రూ.4,64,20,669
చరాస్తి మొత్తం : రూ. 2,74,17,761
అప్పులు : రూ.49,85,026
వీటితోపాటు ప్రత్యేకించి వాహనాలకు సంబంధించి ఒక లిస్ట్ ఇచ్చినట్లే ఇచ్చారు. మహీంద్రా, ఫోర్డ్‌ ఇండీవర్‌, చావర్‌లెట్‌, ఇన్నోవా క్రిష్టా, ఫార్చ్యునర్‌, హూండా స్ల్పెండర్‌, మహీంద్రా స్కార్పియో కార్లు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు. ఈ కార్ల విలువ రూ.1,08,16,564లుగా చూపించారు. 2017-18లో ఆదాయ పన్ను శాఖకు రోజా రూ.52,63,291లు చెల్లించారు.
 
రోజా భర్త సెల్వమణి పేరుతో ఉన్న ఆస్తులు
స్థిరాస్తి మొత్తం : లేదు
చరాస్తి మొత్తం : రూ.58,02,953
అప్పులు : రూ.22,00,000
వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తుల విలువ: 58,80,000 అయితే 2017-18 సంవత్సరానికి గానూ సెల్వమణి చెల్లించిన ఆదాయపు పన్ను రూ.3,94,518 రూపాయలుగా అఫిడవిట్ లో పొందుపరిచారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios