ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ కి ఈ సారి ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గ టికెట్ దక్కిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాగా.. ప్రచారం పేరిట పరిటాల శ్రీరామ్ ప్రజలను భయపెడుతున్నాడని వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు.

‘‘రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ 20 వాహనాల కాన్వాయ్ తో వెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మరి ఎలక్షన్ అధికారాలు ఏం చేస్తున్నట్టు? అన్ని వాహనాలకు అనుమతి ఎలా ఇస్తారు?  ఇవ్వక పోతే స్వాధీనం చేసుకుని కేసునమోదు చేయాలి.’’ అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

అనంతరం చంద్రబాబు ను ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన తర్వాత దాన్ని కాపీ కొట్టి తెలుగుదేశం హామీలు వెల్లడిస్తాం అని ధైర్యంగా చెప్పొచ్చు కదా చంద్రబాబు గారూ. ఇప్పటికే నవరత్నాలను కాపీ పేస్ట్ చేశారు. పక్క రాష్ట్రం పథకాలను ఎత్తేశారు. సొంత మేనిఫెస్టో ప్రకటించలేని దయనీయ స్థితి ఏమిటి బాబూ?’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.