వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి టీడీపీ, జనసేనలపై మండిపడ్డారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. విజయసాయి రెడ్డి  ట్విట్టర్ లో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. పవన్, చంద్రబాబులను టార్గెట్ చేసి.. వారిపై విమర్శల వర్షం కురిపించారు.

‘‘పవన్ కణ్యాణ్ గారి ఉన్మాదం కట్టలు తెంచుకుంది. ప్యాకేజీ ముట్ట చెప్పిన యజమానికి సర్వీస్ ఇవ్వలేక పోతున్నానని టెన్షన్ పడుతున్నాడు. తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టయినా చంద్రబాబు కళ్లలో ఆనందం చూడాలనుకుంటున్నాడు. ఇద్దరు కలిసినా,ఇంకో నలుగురు వచ్చినా ఫలితం ఏక పక్షంగా ఉంటుంది.’’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో..‘‘“హిజ్ మాస్టర్స్ వాయిస్” పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో కలిసి పోటీ చేస్తున్న పార్టీలకు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్టే.అంటే వృథా అయినట్టే. ప్యాకేజీలు తీసుకుని ఎన్నికల వేళ వచ్చిపోయే పార్టీలకు, నాయకులకు గట్టి గుణ పాఠం చెప్పాలి. ఇంకో సారి ప్రజల ముందుకు రావడానికి భయపడేలా తీర్పు ఉండాలి.’’ అని అన్నారు.

‘‘జనసేన, బిస్పీపీ, సిపిఐ,కాంగ్రెస్ అభర్థుల జాబితా చంద్రబాబే తయారు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్లు చీల్చడానికి నిధులు సమకూర్చి బరిలోకి దించుతున్నారు. ఇదంతా 30-40 ఏళ్ల కిందటి పనికి రాని ఫార్ములా. చిల్లర పార్టీలకు ఓటేసి తమ హక్కును వృథా చేసుకునేంత అమాయకులేం కాదు ప్రజలు’’ అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.

‘‘నిటారుగా, నిక్కచ్చిగా నిలబడాల్సిన ప్రశ్న...మోచేతి నీళ్లు తాగేందుకు అడ్డంగా వంగి పోయింది. ప్రశ్నిస్తా అని వచ్చిన వ్యక్తి లాలూచీ పడ్డాడు. పోలీసులాగా వ్యవహరించాల్సిన వాడు దొంగతో కలిసి పోయాడు.  దోపిడీ సొమ్ముకు కాపలా కుక్కలా మారాడు. ప్రజలు వదుల్తారా? దుడ్డు కర్రలతో వెంటపడ్డారు.’’ అని పవన్ ని హెచ్చరించారు.