వైసీపీ నేత విజయసాయి రెడ్డి మరోసారి జనసేన అధినేత పవన్ పై కౌంటర్లు వేశారు. ప్రస్తుతం పవన్ ఎన్నికల ప్రచారంలో బిజి బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవల పవన్ ఓ గ్రామంలో ఈతచాప పై కూర్చొని మట్టి కుండలో భోజనం చేశారు. ఈ ఫోటోలు నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. కాగా.. దీనిపై విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ వేశారు. 

‘‘రూ.52 కోట్ల ఆస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్లో చూపిన వ్యక్తి ఈత చాపపై కూర్చుని మట్టి పిడతలో అన్నం తినడం డ్రామా కాక మరేమవుతుంది. 30-40 ఏళ్ల కింద ఇటువంటి వేషాలు వేస్తే జనాలు నమ్మేవారేమో.మహాత్మా గాంధీ అంత సాధారణ వ్యక్తినని షో చేస్తే ప్రజలు పగలబడి నవ్వుకుంటున్నారు.’’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.