వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. మరో నాలుగు రోజుల్లో చంద్రబాబు... పెట్టేబేడా సర్దుకొని పోవాల్సిందేనని పేర్కొన్నారు.
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. మరో నాలుగు రోజుల్లో చంద్రబాబు... పెట్టేబేడా సర్దుకొని పోవాల్సిందేనని పేర్కొన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం తమ పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. విజయసాయి రెడ్డి ట్వీట్లు చేశారు.‘‘అమరావతిలోని ‘ప్రజావేదిక’ ప్రభుత్వ ప్రాంగణం. టీడీపీ కార్యక్రమాల కోసం చంద్రబాబు ఇప్పటి వరకు దానిని దుర్వినియోగం చేస్తూ వచ్చారు. కోడ్ అమలులో ఉన్నా తాను ఆపద్ధర్మ సీఎం అని మర్చిపోయి అదే ప్రజావేదికలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రవర్తనా నియమావళినే హేళన చేస్తున్నారు.’’ అని అన్నారు.
‘‘సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఎలాగైనా ఇరికించేందుకు ఒత్తిళ్లు మొదలు పెట్టారు బాబు అండ్ కో. పునేఠా ఇప్పటికే బలిపశువయ్యాడు. కోడ్ అమలులో ఉన్నా మంత్రివర్గానికి జవాబుదారీగా ఉండాలని ఎల్వీని బెదిరిస్తున్నారు. నాలుగు రోజుల్లో పెట్టేబేడా సర్దుకుని పోయేవారిని పట్టించుకోనవసరం లేదు.’’ అని అన్నారు.
‘‘ఈవీఎంలపై చంద్రబాబు మతితప్పి మాట్లాడుతుంటే దాన్నిబలపరుస్తూ కాంగ్రెస్ కూడా రంగంలోకి దిగింది. ఘోర పరాజయం తర్వాత ఎన్నికలను రద్దు చేయాలని చంద్రబాబు డిమాండు చేసినా ఆశ్చర్యం లేదు. పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేసిన 80 శాతం మంది ప్రజలకు లేని అనుమానాలు తుప్పు బాబుకు వస్తున్నాయి.’’ అని విజయసాయి రెడ్డి అన్నారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 22, 2019, 12:26 PM IST