ప్రముఖ సినీ నటుడు, విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ మంచు మోహన్ బాబు వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో మోహన్ బాబు లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. 

భేటీ అనంతరం వైఎస్ జగన్ సమక్షంలో మోహన్ బాబు వైసీపీ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరికాసేపట్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. ఇదిలా ఉండగా గత కొన్ని రోజులుగా తన విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్‌‌ విషయమై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం విదితమే. 

ఈ నేపథ్యంలో టీడీపీకి వ్యతిరేకంగా ఉన్న వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం. కాగా.. వైఎస్ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మంచు విష్ణు భార్య వెరోనికా కూడా.. జగన్ అన్న తన ప్రాణం అంటూ ట్విట్టర్ లో పేర్కొన్న సంగతి విదితమే.