విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ నేత మోహన్ బాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు క్యారెక్టర్ లేదంటూ విరుచుకుపడ్డారు. తనపై కేసులు లేవని వైఎస్ జగన్ పై కేసులు ఉన్నాయంటూ ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 

విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎదుటి వారు బాగుపడితే ఓర్వలేని వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చంద్రబాబుకు పార్టీలేదని ఆయన పుట్టుక కాంగ్రెస్ పార్టీతోనే స్టార్ట్ అయ్యిందని ఆయన పునాది కాంగ్రెస్ పార్టీయేనంటూ ఆరోపించారు. వైఎస్ జగన్ కు సొంతపార్టీ ఉందని ఆ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. 

ఒక సినీనటుడుగా, మంచి వ్యక్తిగా రోడ్లపై తింటూ, తిరుగుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారకరామారావు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విరుచుకుపడ్డారు. 

తెలుగుదేశం పార్టీని లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ విరుచుకుపడ్డారు. అహంకారం వీడాలని సూచించారు. చంద్రబాబు మోసపూరిత మాటలకు గురైన వారిలో తాను ఒకరినని చెప్పుకొచ్చారు. 

రాష్ట్రానికి ఏదో చేస్తారని ఉద్దేశంతో ఆయన వెంట నడిచి తప్పు చేశానని ఆ విషయం అన్న ఎన్టీఆర్ కు స్పష్టం చేసినట్లు స్పష్టం చేశారు. తనకు దర్శకరత్న దాసరి నారాయణ రావు విజయవాడ తీసుకువచ్చి తన పేరు మార్చి అన్నం పెట్టారని చెప్పుకొచ్చారు. 

తనకు అన్నం పెట్టారని తాను ఎంతో మందికి అన్నం పెట్టానని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఎవరూ అన్నం పెట్టలేదని పెట్టరని కూడా చెప్పుకొచ్చారు. దివంగత సీఎం ఎన్టీఆర్ విస్తరిలో వడ్డించుకుంటే ఆ విస్తరిని రాత్రికి రాత్రే లాక్కున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటూ ఆరోపించారు. 

చంద్రబాబు నాయుడు యూటర్న్ సీఎం అంటూ ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై ఎన్ని యూటర్న్ లు తీసుకున్నారో ప్రజలకు తెలుసునన్నారు. చంద్రబాబు నాయుడు చుట్టూ ఉన్న వారే తప్ప ప్రజలు నమ్మడం లేదన్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని నో మోర్ తెలుగుదేశం పార్టీ అంటూ స్పష్టం చేశారు. క్యారెక్టర్ లేని చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మెద్దంటూ హితవు పలికారు.