ఏపీ ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పేరు చెబితేనే ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన బుద్ధా వెంకన్న.. జగన్, కేసీఆర్ లపై మండిపడ్డారు. కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటి అన్న జగన్  వ్యాఖ్యలపై తవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ ఇచ్చిన వెయ్యి కోట్లను జగన్ ఎన్నికల్లో పంచుతున్నారని ఆయన ఆరోపించారు.

జగన్ రాష్ట్రాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ లాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులని చెప్పారు. కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటన్న జగన్‌ వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. జగన్‌ను ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. జగన్‌కు సీఎం కుర్చీపై ధ్యాసే తప్ప మరోటి లేదన్నారు. ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు రావని స్పష్టం చేశారు. జగన్‌ది భస్మాసుర హస్తమని మండిపడ్డారు.