ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో.. అభ్యర్థులను ఖరారు చేయడంలో టీడీపీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే కొంత జాబితానురెడీ చేయగా... ఇంకొందరి పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే.. ఒక టికెట్ విషయంలో మాత్రం దాదాపు పేరు ఖరారు అనుకున్న తర్వాత.. పార్టీ అధిష్టానం మరోసారి పునరాలోచనలో పడింది. అదే రంపచోడవరం నియోజకవర్గం.

రంపచోడవరం టికెట్ వంతల రాజేశ్వరికి ఇవ్వాలని భావించారు. అయితే.. ఆమెకు అనుకూలంగా కొందరు ఉంటే.. ఆమెకు టికెట్ ఇవ్వవద్దని కొందరు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో.. ఈ టికెట్ విషయంలో  చంద్రబాబు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఆమె అనుకూల వర్గం, వ్యతిరేక వర్గం రెండూ.. అమరావతిలో వివాదం సృష్టించారు. శనివారం నుంచి రంపచోడవరం నియోజకవర్గం విషయంలో కసరత్తు చేస్తున్న అధిష్ఠానం ఓ సందర్భంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరివైపే మొగ్గు చూపింది. ఇక ఆమెను ప్రకటించడం లాంఛనం మాత్రమే అనుకున్న పరిస్థితుల్లో అనేక పరిణామాలు అమరావతి వేదికగా చోటు చేసుకోవడంతో సోమవారం రాత్రి చంద్రబాబు తిరిగి నియోజకవర్గంలోని పార్టీ ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

మరి ఈ టికెట్ విషయంలో  చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది.