ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై మిషన్ చాణక్య నిర్వహించిన సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. జగన్ ముఖ్యమంత్రి అవుతారని సర్వే స్పష్టం చేసింది. 

వైఎస్ఆర్సీపీ: 91-105
తెలుగుదేశం: 55-61
ఇతరులు: 5-9

ఆంధ్రప్రదేశ్ లోని 175 శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా ఆదివారం చివరి దశ పోలింగ్ ముగియడంతో వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వెలువడ్డాయి.