మరో 27 రోజుల్లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి తెలుగు దేశం పార్టీ అభ్యర్థులను గెలింపించుకోవాలని మంత్రి నారా లోకేశ్ ప్రజలను కోరారు. మరోసారి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా పనిచేయాల్సిన అవసరం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వుందన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తును ఓట్లను గుద్ది గుద్ది రిపేర్ వచ్చేలా చేయాలని లోకేశ్ చమత్కరించారు. 

శుక్రవారం మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో లోకేశ్ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తమ కుటుంబ సభ్యులు ఏ నియోజవర్గంలో పోటీ చేస్తే అక్కడ అభివృద్ది పరుగులు పెడతుందని లోకేశ్ అన్నారు. ఎక్కడో రాయలసీమలో మారుమూల ప్రాంతమైన కుప్పం నియోజకవర్గంలో 1989 మొదటిసారి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసి గెలిచారని లోకేశ్ గుర్తుచేశారు. తప్పుడు ర్వాత ఆ ప్రాంతాన్ని భారీ స్థాయిలో అభివృద్ది చేసి చూపించారన్నారు. అలా గతంలో ఎవరికీ తెలియన ప్రాంతం పేరు ఇప్పుడు మారుమోగుతోందన్నారు. రాష్ట్రంలో కుప్పం పేరు తెలియనివారుండరని లోకేశ్ వెల్లడించారు. 

అందువల్ల మా నాన్న ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కుప్పం నుండి నన్ను పోటీ చేయమని చాలామంది సూచించారని లోకేశ్ తెలిపారు. కానీ అది ముఖ్యమంత్రి బ్రాండ్. అక్కడి నుండి ఆయనే పోటీ చేయాలని కోరుకున్నా. అందుకోసమే కుప్పం నుండి ఈ మంగళగిరి నుండి పోటీ చేస్తున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకరవర్గాలు అసూయ పడేలా మంగళగిరిని అభివృద్ది చేసి చూపిస్తానని లోకేశ్ హామీ ఇచ్చారు.   

తాను నివాసముండేది కూడా ఇక్కడే కాబట్టి నిత్యం నియోజవర్గ ప్రజలకు అందుబాటులో వుంటానన్నారు. ఇప్పటికే మంగళగిరి నుండి ఎవరు వచ్చినా నన్ను కలవనివ్వాలని సెక్యూరిటి సిబ్బందిని కూడా ఆదేశించినట్లు తెలిపారు. తనపై నమ్మకం వుంచిన ప్రజల కోసం అహర్నిశలు శ్రామికుడిగా పనిచేయడానికి సిద్దంగా వున్నానని లోకేశ్ అన్నారు. 

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కొందరు నాయకులు కుల, మత, ప్రాంతాల పేరుతో  మిమ్మల్ని రెచ్చగొట్టడానికి వస్తారని ఆరోపించారు. అలాంటి వారికి తమ 
 కులం, మతం, ప్రాంతం అన్నీ మంగళగిరే అని సమాధానం చెప్పాలన్నారు. 

స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ లో గట్టిగా పోరాడారు. ప్రధాని అంటే సొంత పార్టీ నాయకులే భయపడుతుంటే నిండు సభలో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ   గల్లా జమదేవ్ సంభొధించారన్నారు. అందువల్లే ఆయనపై ఇప్పుడు పోలీసులు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని లోకేశ్ పేర్కొన్నారు. అందువల్ల ప్రజల కోసం పనిచేసే ఆయన్ను ఎంపీగా, తనను ఎమ్మెల్యేగా ఆశిర్వదించాలని లోకేశ్ కోరారు.