ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేష్.. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారో నని అందరూ ఎదురు చూశారు. లోకేష్ పోటీ చేసే నియోజకవర్గం ఇదే.. అంటూ గత కొంతకాలంగా చాలా పేర్లు కూడా వినపడ్డాయి. ముఖ్యంగా విశాఖ ఉత్తరం, విశాఖ తూర్పు.. ఈ రెండింటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోడీ చేయడం ఖాయమన్నారు.  కాగా దీనిపై తాజాగా స్పష్టత ఇచ్చారు.

లోకేష్ మంగళగిరి నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు. దీనిపై టీడీపీ అధికారికంగా ప్రకటన చేసింది. అనేక సమీకరణాల తర్వాత లోకేష్ ని రాజధాని ప్రాంతమైన మంగళగిరి నుంచి రంగంలోకి దించాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నారా లోకేష్ విశాఖపట్నం జిల్లా నుంచి పోటీ చేస్తారని విస్తృతంగా ప్రచారం సాగింది. ఆయన విశాఖ ఉత్తర నుంచి గానీ భిమిలీ నుంచి గానీ పోటీ చేయవచ్చునని భావించారు.

లోకేష్ కోసం మంత్రి గంటా శ్రీనివాస రావును లోకసభకు పోటీ చేయించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. అయితే, పలు సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని లోకేష్ ను మంగళగిరి నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.