సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో టీడీపీ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. జేడీని పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయనతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో లక్ష్మీనారాయణతో భేటీకి సంబంధించిన వివరాలను గంటా... ముఖ్యమంత్రికి వివరించనున్నారు. జేడీ ఒకవేళ పార్టీలోకి వస్తే ఆయనకు ఈ సీటు కేటాయించాలి, అసెంబ్లీకి పోటీ చేయించాలా..? పార్లమెంటు‌కు పోటీ చేయించాలా..?  స్థానిక నేతలను ఎలా ఒప్పించాలన్న దానిపై ఇద్దరు చర్చించే అవకాశముంది.

మరోవైపు లోకేశ్ సీటుపై క్లారిటీ తీసుకుని తాను ఎంపీగా పోటీ చేయాలా లేక అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగాలన్న అంశాలపై గంటా.. చంద్రబాబు నుంచి క్లారిటీ తీసుకోనున్నారు.