వైసీపీ అధినేత జగన్ పై.. ఏపీ మంత్రి దేవినేని ఉమా మరోసారి మండిపడ్డారు.  విజయవాడలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన దేవినేని  ఉమా.. జగన్ పై నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం 40మందికి డీఎస్పీ ప్రమోషన్లు ఇస్తూ.. ఒకే సమాజిక వర్గానికి కట్టెబట్టారంటూ జగన్ చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. 

జగన్ చేసిన ఆరోపణలు నిరాధారమన్నారు. ఒకవేళ అదే నిజమైతే.. ఆ 40మంది అధికారుల పేర్లు  మీడియా ముందు బయటపెట్టాలని దేవినేని సవాల్ విసిరారు. ఎవరు ఎప్పుడు ప్రమోషన్ ఇచ్చారో మొత్తం మీడియా ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. మీడియాపై నమ్మకం లేకపోతే.. అవినీతి పత్రిక అయిన సాక్షిలో వివరాలు రాయాలన్నారు. దుర్మర్గంగా ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.
 
నిన్న జగన్ మీడియాతో మాట్లాడుతూ స్పీకర్ కోడెలే చొక్కా చింపుకున్నారని అన్నారని.. చొక్కాలు చింపుకోవడం, క్రిమినల్ వ్యక్తిత్వం వైసీపీ నేతలకే ఉంటుందని దేవినేని ఉమ తీవ్ర స్థాయిల ఆరోపించారు. నిన్న గవర్నర్‌ దగ్గర జగన్‌ చెప్పినవన్నీ అబద్దాలేనని అన్నారు. పోలింగ్ రోజే జగన్‌ ఓటమిని ఒప్పుకున్నారని అన్నారు. బీజేపీ సహకారంతో జగన్‌ మళ్లీ కుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు.