సీఎం పదవిపై వ్యామోహంతో జగన్.. అరచకాలు సృష్టిస్తున్నాడని ముఖ్యమంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడలో మీడియా  సమావేశంలో మాట్లాడారు. ఓటమి భయంతో జగన్ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

జగన్ అధికారంలోకి వస్తే రౌడీరాజ్యం వస్తుందన్నారు. సామంతరాజు జగన్ అండతో అమరావతిపై కేసీఆర్ దండయాత్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీపై మోదీ, కేసీఆర్, జగన్ ముప్పేట దాడి చేస్తున్నారని దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శించారు.

వైసీపీ కార్యకర్తలు సీఐఎస్ఎఫ్ మీద రాళ్లు, చెప్పులు విసురుతున్నారని ఆయన అన్నారు. ఓటమి భయంతో కార్యర్తలను జగన్ రెచ్చగొడుతున్నారని అన్నారు. సభా వేదికపై నుంచి జగన్ దిగగానే సీఐఎస్ఎఫ్ జవాన్ల పై చెప్పులు విసిరారని మండిపడ్డారు.

పులివెందలకు నీరు ఇచ్చామనే కక్షతోనే కార్యకర్తలను జగన్ రచ్చగొట్టారని ఆరోపించారు. ఒక రోజు ప్రచారాన్ని కూడా ఆపుకొని పుసుపు-కుంకుమ డబ్బులు మహిళలకు అందకూడదని జగన్ కుట్రలు చేస్తున్నారని దేవినేని మండిపడ్డారు.