మంత్రాలయం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ముహూర్తం చూసుకుని పోటాపోటీగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 

అయితే మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి మాత్రం అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. కగ్గల్లులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తిక్కారెడ్డి అక్కడ జరిగిన కాల్పుల్లో గాయపడ్డారు. 

తిక్కారెడ్డి గన్ మెన్ గాల్లోకి  కాల్పులు జరపడంతో ఒక బుల్లెట్ తిక్కారెడ్డి కాల్లోకి దూసుకెళ్లింది. ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తిక్కారెడ్డి అంబులెన్స్‌లో వచ్చి నామినేషన్‌ వేశారు. 

అంబులెన్స్‌లో స్ట్రెచర్‌పై వచ్చిన ఆయన తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. తిక్కారెడ్డి నామినేషన్ సందర్భంగా భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. విషయం తెలిసిందే.