ఏపీ ఎన్నికల బరిలో ఈసారి సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు వారి తల్లులు, తండ్రులు రాజ్యం ఏలగా.. ఇప్పుడు వారసులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవినేని అవినాష్, పరిటాల శ్రీరామ్ లను ఉద్దేశించి  సినీ హీరో మంచు విష్ణు స్పెషల్ ట్వీట్ చేశారు.

పరిటాల శ్రీరామ్‌, దేవినేని అవినాష్‌లను ప్రస్తావిస్తూ.. రాజకీయాల్లో వారి తండ్రుల స్థాయికి చేరాలని ఆకాంక్షించారు మంచు విష్ణు. ట్విట్టర్ వేదికగా వారి విజయాన్ని కాంక్షించారు. మంచు కుటుంబానికి దేవినేని అవినాష్, పరిటాల శ్రీరామ్‌లతో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతలు ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో విష్ణు వారికి ఒకేసారి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

ఇదిలా ఉంటే.. మంచు విష్ణు ఇటు టీడీపీ నేతలతోనూ... అటు వైసీపీ అధినేత జగన్ తోనూ రెండు వైపులా మంచి రిలేషన్ మెంయిటైన్ చేస్తున్నారు. దీనిపై కూడా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సంగతి పక్కన పెడితే వచ్చే ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి, దేవినేని అవినాష్ గుడివాడ నుంచి పోటీకి సిద్ధమయ్యారు.