Asianet News TeluguAsianet News Telugu

జగన్ తో ఎల్వీ భేటీ: ప్రభుత్వ సలహాదారుగా అజయ్ కల్లాం

సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంనే కొనసాగాలని జగన్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని అఖిల భారతస్థాయి అధికారులు కలవనున్నారు. ఇకపోతే ఏపీలో నీతివంతమైన పాలన అందించడమే తన లక్ష్యమని అందుకు సహకరించాలని జగన్ సీఎస్ ను కోరినట్లు తెలుస్తోంది. 

LV Subrahmaniam meets YS jagan
Author
Amaravathi, First Published May 23, 2019, 8:03 PM IST

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వైయస్ జగన్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతోపాటు ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 

ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై జగన్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 30న విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని అందుకు ఏర్పాట్లు చేయాలని జగన్ ఆదేశించారు. 

ప్రమాణ స్వీకారం అయిన తర్వాత జూన్ 1 నుంచి జూన్ 5 వరకు నూతన సీఎం జగన్ సమీక్షలు నిర్వహించనున్నారు. పాలనలో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితులపై జగన్ సమీక్షలు చేయనున్నారు. ఇకపోతే సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. 

సీఎస్ గా ఎల్వీ సుబ్రహ్మణ్యంనే కొనసాగాలని జగన్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కాబోయే సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని అఖిల భారతస్థాయి అధికారులు కలవనున్నారు. ఇకపోతే ఏపీలో నీతివంతమైన పాలన అందించడమే తన లక్ష్యమని అందుకు సహకరించాలని జగన్ సీఎస్ ను కోరినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ సీఎస్ అజయ్ కల్లాం ని నియమిస్తున్నట్లు వైయస్ జగన్ సీఎస్ తో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అజయ్ కల్లాంతో  కలిసి పనిచేయాలని జగన్ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు సూచించినట్లు తెలుస్తోంది.  
 
Follow Us:
Download App:
  • android
  • ios