ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత కుమారుడు, ఏపీ కి నాలుగు సంవత్సరాలుగా మంత్రిగా కొనసాగారు.. అయినా లోకేష్ కి.. రాష్ట్రంలోని నియోజకవర్గాల పేర్లు కూడా సరిగా తెలియడం లేదనిపిస్తోంది. సరే.. అన్ని నియోజకవర్గాల పేర్లు అందరికీ గుర్తు ఉండవు అనుకోవచ్చు...కానీ కనీసం పోటీ చేస్తున్న నియోజకవర్గం పేరు అయినా సరిగా తెలుసుకోవాలా..? ఆ విషయంలో కూడా లోకేష్ విఫలం చెందారనే వాదనలు వినపడుతున్నాయి.

ఇంతకీ  అసలు మ్యాటరేంటంటే.. లోకేష్ కి టీడీపీ నుంచి మంగళగిరి టికెట్ ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. టికెట్ ఖరారు అయినప్పటి నుంచి లోకేష్.. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో ఓటర్ల మనసును గెలుచుకోవాల్సింది పోయి.. అభాసులపాలౌతున్నారు. 

మొన్నటికి మొన్న వివేకానంద రెడ్డి చనిపోతే పరవశించిపోయాం అంటూ కామెంట్స్ చేశారు. ఆ వీడియో పట్టుకొని యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏకి పారేశారు. ఇక ఇప్పుడు తమ సొంత నియోజకవర్గం పేరు కూడా సరిగా పలకడం లేదు. మంగళగిరి ని పట్టుకొని.. మందలగిరి చేసేశారు. దీనిపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇలా ప్రతీసారి ప్రచారంలో తప్పులు చేసుకుంటూ పోతే.. గెలవడం కష్టమౌతుందనది సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారట. దీనికి తోడు.. లోకేష్ సభలకు జనాల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని గిట్టనివారు చెబుతున్నారు.