లోకేశ్...  ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సందర్భంగా బాగా వినబడుతున్న పేరు. సీఎం చంద్రబాబు కొడుకుగా, మంగళ గిరి అభ్యర్థిగానే కాకుండా అతడు మరో విధంగా పాపులర్ అవుతున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పలు సందర్భాల్లో పప్పులో కాలేసి నవ్వులపాలైన విషయం తెలిసిందే. మరోసారి అలాంటి ప్రకటనే చేసి స్ధానికుల ముందే కాదు నెటిజన్ల ముందు కూడా నవ్వులపాలయ్యారు.

మంగళగిరి ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించే క్రమంలో మచిలీపట్నం పోర్టును  తరలించుకుపోడానికే కేసీఆర్ తెలంగాణ రాజకీయాల్లో తలదూర్చుతున్నాడంటూ అసహజమైన ఆరోపణలు చేశారు. 

దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు సముద్ర తీరమే లేని తెలంగాణ కు పోర్టును ఎలా తరలించుకుపోతారంటూ లోకేశ్ ను ప్రశ్నిస్తూనే నవ్వుకుంటున్నారు. 

వీడియో