ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు, మంత్రి లోకేష్ తప్పులు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ఆయన ఏ బహిరంగ సభలో మాట్లాడినా. .. పొరపాటున ఏదో ఒకటి మాట్లాడేసి పార్టీని ఇరుకున పెడుతుంటారు.

మొన్నటికి మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే పరవశించిపోయాం అంటూ కామెంట్స్ చేసి ఇరుక్కుపోయాడు. మంగళగిరి ఎన్నికల ప్రచారంలో.. నియోజకవర్గం పేరును కూడా తప్పుగా పలికారు. అంతేకాదు.. ఎన్నికల తేదీని కూడా తప్పుగా చెప్పారు. వీటన్నింటినీ పట్టుకొని ఆయనను నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

కాగా.. మరోసారి లోకేష్ అడ్డంగా దొరికిపోయారు. శుక్రవారం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి లోకేష్ నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఎన్నికల అఫిడవిట్ లో మరోసారి లోకేష్ మిస్టేక్ చేశారు. భర్త పేరు అని రాసి ఉన్న చోట తన తండ్రి చంద్రబాబు పేరు రాయడం విశేషం. అసలు భర్త పేరు అని అఫిడవిట్ లో ఉండటమే తప్పు అనుకుంటే.. దానికి లోకేష్ తన తండ్రి పేరు రాయడం మరింత విచిత్రం. కాగా.. ఆ అఫిడవిట్ పేపర్ ఇప్పుడు సోషల్ మీడియాలో  చెక్కర్లు కొడుతోంది.