Asianet News TeluguAsianet News Telugu

ఏపి ఎన్నికలపై లగడపాటి సర్వే...రిలీజ్ డేట్ ఫిక్స్

ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఎన్నికల కోలాహలం కొనసాగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ నుండి ఇవాళ పోలింగ్ ముగిసే వరకు అన్ని ప్రధాన పార్టీలు  శక్తి వంచన లేకుండా విజయంకోసం పోరాడాయి. ఇక అన్ని పార్టీల భవితవ్యం ఇవాళ ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయ్యాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలకు ముందే ఓటింగ్ సరళి, ప్రజల నాడిని బట్టి ఏ పార్టీ బలమెంతో  ముందుగానే చెబుతానంటున్నారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్.  

lagadapati rajagopal  election survay announcement date fixed
Author
Vijayawada, First Published Apr 11, 2019, 6:05 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా ఎన్నికల కోలాహలం కొనసాగింది. ఎలక్షన్ నోటిఫికేషన్ నుండి ఇవాళ పోలింగ్ ముగిసే వరకు అన్ని ప్రధాన పార్టీలు  శక్తి వంచన లేకుండా విజయంకోసం పోరాడాయి. ఇక అన్ని పార్టీల భవితవ్యం ఇవాళ ఈవీఎం మిషన్లలో నిక్షిప్తమయ్యాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలకు ముందే ఓటింగ్ సరళి, ప్రజల నాడిని బట్టి ఏ పార్టీ బలమెంతో  ముందుగానే చెబుతానంటున్నారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్.  

ఈ ఎన్నికల్లో జనసేన పోటీతో త్రిముఖ పోటీ జరిగిందని లగడపాటి తెలిపారు. కొత్త రాష్ట్రాన్ని నడిపించే సరైన పాలకుడిని ఎన్నుకోవాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారు. దీంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని లగడపాటి తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలకు సబంధించిన తాను చేయించిన సర్వే ఫలితాలు ఇప్పటికే రెడీ అయ్యాయని... అయితే ఈసీ నిబంధనల మేరకు మే 19న సాయంత్రం 6 గంటల తర్వాత సర్వే ఫలితాలు ప్రకటిస్తానని లగడపాటి స్పష్టం చేశారు.

ఇవాళ విజయవాడలో లగడపాటి తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈవీఎం మిషన్లలో  తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా పోలింగ్ ఆలస్యంగా జరుగుతోందన్నారు.  ఈ ఎన్నికలు అన్ని పార్టీల మధ్య పోరు రసవత్తంగా వుందని లగడపాటి పేర్కొన్నారు.

గతంలో కాంగ్రెస్ ఎంపీగా మనందరికి సుపరిచితమైన లగడపాటి రాజగోపాల్ ఆంధ్ర ప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రా ఆక్టోపస్ ఫేమస్ అయ్యారు. రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన మాటమీద నిలబడ్డారు. ఇలా రాజకీయాలకు దూరమైన ఆయన కొత్తఅవతారమొత్తారు. అదే పొలిటికల్ అనలిస్ట్. 

ఎన్నికల సమయంలో ఓటర్ల నాడిని పసిగట్టి ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయో ఆయన ప్రకటిస్తుంటారు. అలా గతంలో కొన్ని రాష్ట్రాల్లో కాస్త ఖచ్చితమైన సర్వే ఫలితాలను వెల్లడించి ఆయన ఆంధ్రా ఆక్టోపస్ గా మారారు. అయితే తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోతుందంటూ ఆయన వెల్లడించిన సర్వే ఫలితాలు తలకిందులయ్యారు. ఆయన చెప్పినట్లుగా మహాకూటమి కాకుండా మళ్లీ టీఆర్ఎస్ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో లగడపాటి సర్వేపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన వెనుకడుగు వేయకుండా ఏపిలో సర్వే చేపట్టారు. అయితే ఈ సారి ఆయన సర్వే ఫలితాలు ఎలా వుంటాయో చూడాలి.    
 
Follow Us:
Download App:
  • android
  • ios