కర్నూల్: కర్నూల్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. ఆలూరు నుండి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోట్ల హరి చక్రపాణిరెడ్డి టీడీపీలో చేరనున్నారు.

కర్నూల్ జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా కోట్ల సుజాతమ్మ పోటీ చేస్తున్నారు. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

ఈ నెల 22వ తేదీన కోట్ల హరిచక్రపాణిరెడ్డి బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం నాడు లద్దగిరిలో కోట్ల హరిచక్రపాణిరెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు.

కోట్ల హరి చక్రపాణిరెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. ఆలూరులో బరిలో ఉన్న కోట్ల సుజాతమ్మకు కోట్ల హరిచక్రపాణిరెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉంది.సుజాతమ్మకు మద్దతుగా హరిచక్రపాణిరెడ్డి తన నామినేషన్‌ను ఉపసంహరించుకొనే అవకాశం ఉందని సమాచారం.అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.