ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ కీలక నేత, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. కార్యకర్తలు, అనుచరులు, కుటుంబసభ్యులతో చర్చించిన తర్వాత ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నా. 

కొత్తపల్లి సుబ్బారాయుడు నేడు ఆదివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో వైసిపిలో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీచేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టీడిపిలో చేరారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ తరఫున నరసాపురం టికెట్‌ ఆశించారు. 

టికెట్ రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దాంతో కార్పొరేషన్ పదవికి రాజీనామా చేశారు. నరసాపురం నుంచి 2004లో టీడీపీ తరఫున పోటీచేసి గెలిచారు. అయితే, 2009లో పీఆర్పీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.