సీనియర్ నేత కొణతాల రామకృష్ణ మళ్లీ వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీలో కీలక నేతగా ఉన్న కొణతాల తర్వాత పార్టీకి రాజీనామా చేశారు. అలా అనీ మరే పార్టీలోనూ ఆయన చేరలేదు. కానీ ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. 

ఒకానొక సమయంలో ఆయన టీడీపీలో చేరదామనే అనుకున్నారు. అందరూ ఆయన టీడీపీలో చేరినట్లే అని కూడా భావించారు. కానీ... ఆయన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. మళ్లీ జగన్ చెంతుకు చేరాలని భావించారు. ఆయనపై వైసీపీ అధిష్టానం విధించిన సస్పెన్షన్ ని కూడా ఎత్తివేశారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం జగన్ సమక్షంలో మళ్లీ పార్టీలో చేరనున్నారు.

ఇప్పటికే ఆయన లోటస్ పాండ్ కి చేరుకున్నారు. అక్కడ జగన్ తో భేటీ అయ్యి.. ఆ తర్వాత పార్టీ కండువా కప్పుకోనున్నారు. అయితే.. కొణతాలకు వైసీపీ టికెట్ ఇస్తుందా? ఒక వేళ ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. కొణతాలతోపాటు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వంగా గీత, బుట్టా రేణుక, బల్లి దుర్గ ప్రసాద్ లు కూడా వైసీపీలో చేరనున్నారు.