Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు వ్యూహాలు, అవినాష్ పాచిక పారలేదు: గుడివాడ కొడాలి నానిదే


దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు. దేవినేని అవినాష్ అయితే కొడాలి నానికి చెక్ పెడతారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మళ్లీ కొడాలి నానికే పట్టం కట్టారు నియోజకవర్గ ప్రజలు. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డ అంటూ మరోసారి నిరూపించారు. 
 

kodali Nani is a huge success from Gudivada
Author
Gudivada, First Published May 25, 2019, 9:04 PM IST

గుడివాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో హాట్ సీట్ గుడివాడ. గుడివాడ నియోజకవర్గంపై అటు తెలుగుదేశం పార్టీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నేశాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు పక్కలో బళ్లెంలా కొడాలి నాని తయారవ్వడంతో అతనిని ఎలాగైనా గద్దె దించాలని చంద్రబాబు వ్యూహం రచించారు. 

దేవినేని అవినాష్ ను రంగంలోకి దించారు. దేవినేని అవినాష్ అయితే కొడాలి నానికి చెక్ పెడతారని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. మళ్లీ కొడాలి నానికే పట్టం కట్టారు నియోజకవర్గ ప్రజలు. గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డ అంటూ మరోసారి నిరూపించారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆరుగురు సభ్యులపై చంద్రబాబు అండ్ కో ఫోకస్ పెట్టారు. వారి ఓటమే లక్ష్యంగా పావులు కదిపారు. అందులో ఒకరు కొడాలి నాని. కొడాలి నాని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో విజయవాడలో పోటీ చేద్దామని ఆశగా ఉన్న దేవినేని అవినాష్ ను తీసుకువచ్చి గుడివాడ బరిలో దించారు చంద్రబాబు. 

యువకుడు కావడంతో గెలిపిస్తారని ధీమాగా ఉన్నారు. సాక్షాత్తు చంద్రబాబునాయుడు సైతం గుడివాడ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దేవినేని అవినాష్ ను గెలిపిస్తే గుడివాడ రూపు రేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. అనేక హామీలు ఇచ్చారు. 

అంతేకాదు టీడీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ నియోజకవర్గ మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేశారు. కానీ నియోజకవర్గ ప్రజలు మాత్రం కొడాలి నానినే ఆదరించారు. 20 ఏళ్లుగా ఆదరిస్తున్న గుడివాడ ప్రజలు మరోసారి పట్టం కట్టారు. అంతేకాదు గతంలో కంటే అత్యధిక మెజారిటీని సైతం అందించారు. 

ప్రజల్లో గుడివాడ ఎమ్మెల్యే అంటే నానినే అనే విధంగా ప్రజల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు కొడాలి నాని. పేద, సామాన్య వర్గాలతో నిత్యం పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరి అభిమానాలను చూరగొనడంతో పాటు నియోజకవర్గంలో నలుమూలల నుంచి మెజార్టీ ఓట్లను సాధించి తన సత్తా చాటారు. 

పలు సామాజిక వర్గాలతో నాని అవినాభావ సంబంధాలు కలిగి ఉండడం ఆయన విజయానికి ప్లస్ అయ్యింది. వ్యక్తిగత, గ్రూపు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న నాని ముందు చంద్రబాబు వ్యూహాలు గానీ అవినాష్ పాచికలు గానీ పారలేదు. గుడివాడ ప్రజలు వాటన్నింటిని తిప్పికొట్టి నానికి జై కొట్టారు. 

మాస్ లో విపరీతమైన క్రేజ్ సంపాదంచుకున్న నాని వారి ఓట్లను బాగానే దండుకున్నారు. అన్ని వర్గాల అండదండలతో గతంలో కంటే అత్యధికంగా ఈసారి 19,479 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వరుస విజయాలతో దూసుకుపోతున్న కొడాలి నానికి ఈసారి కేబినెట్ లో బెర్త్ కన్ఫమ్ అని ప్రచారం జరుగుతుంది. 

గొంతులో ప్రాణం ఉన్నంత వరకు గుండెల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకునే ఉంటానంటూ నాని కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఆయన వెంటే నడుస్తున్నారు. 

వైయస్ జగన్ తో సన్నిహితంగా ఉండే నాయకుల్లో కొడాలి నాని ఒకరు. కాబట్టి ఆయనకు కచ్చితంగా మంత్రి పదవి ఖాయమంటూ ప్రచారం జరుగుతుంది. మరి ఏమవుతుందో వేచి చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios