మైలవరం: కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో  ప్రజా శాంతి పార్టీ తరపున ఇద్దరు అభ్యర్ధులకు  ఆ పార్టీ బీ ఫారాలు ఇచ్చింది. అయితే వీరిద్దరిని కూడ స్వతంత్ర అభ్యర్ధులుగా పరిగణిస్తామని రిటర్నింగ్  అధికారి ప్రకటించారు.

కృష్ణా జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో  షరీఫ్, వెంకటకృష్ణరావులకు ప్రజాశాంతి పార్టీ బీ ఫారాలను ఇచ్చింది. నామినేషన్ల సందర్భంగా   ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి గుర్తించారు.

తనకు కూడ ప్రజా శాంతి పార్టీ బీ ఫారం ఇచ్చిందని షరీఫ్ అనే అభ్యర్ధి రిటర్నింగ్ అధికారికి మంగళవారం నాడు లేఖను చూపారు.  దీంతో ఇద్దరు అభ్యర్ధులు ఒకే పార్టీకి చెందిన బీ ఫారాలను సమర్పించడంతో ఇద్దరిని కూడ స్వతంత్ర అభ్యర్ధులుగా గుర్తిస్తామని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

రాష్ట్రంలోని పలు అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్లలో ఇదే రకంగా ప్రజా శాంతి పార్టీకి చెందిన బీ ఫారాలు జారీ అయ్యాయని  సమాచారం. అయితే ప్రజా శాంతి పార్టీ అభ్యర్థులు ఏ పార్టీ కొంపముంచుతారోననే ఆందోళన సర్వత్రా నెలకొంది.