Asianet News TeluguAsianet News Telugu

స్వతంత్ర అభ్యర్థులకు కేఏపాల్ బంపర్ ఆఫర్

తమ పార్టీ బీ ఫారాలను కొందరు వ్యక్తులు కావాలనే దొంగతనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. 

KA Paul bumper offer to independent candidate
Author
Hyderabad, First Published Mar 28, 2019, 1:49 PM IST

తమ పార్టీ బీ ఫారాలను కొందరు వ్యక్తులు కావాలనే దొంగతనం చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. తమ పార్టీ తరపున ఆయా నియోజకవర్గాల్లో దాఖలు చేసిన నామినేషన్లను కొన్నిచోట్ల అకారణంగా తిరస్కరించారని ఆయన ఆరోపించారు. 

రాష్ట్రంలో మొత్తం 200చోట్ల(175 అసెంబ్లీ, 25ఎంపీ) నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటే 75చోట్ల మాత్రమే వేయగలిగామని తెలిపారు. వాటిలో కూడా చాలా నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయని వెల్లడించారు. 

చివరి నిమిషంలో తమ పార్టీ ఆఫీసులోని స్టాంపులు, బీ ఫామ్స్‌ను ఎవరో దొంగిలించడం వల్లనే అన్నిచోట్ల నామినేషన్లు వేయలేకపోయాయని పాల్ తెలిపారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని, ఈరోజు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి కంప్లైంట్ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయాలని సీఈసీకి కోరనున్నట్లు వెల్లడించారు. 

ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్లు వేసి తిరస్కరణకు గురైన అభ్యర్థులు తనకు సమాచారం అందిస్తే దాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్తామని పాల్ తెలిపారు. ప్రజాశాంతి పార్టీ పోటీలో లేని స్థానాల్లో ఇండిపెండెంట్‌ అభ్యర్థులెవరైనా ఆసక్తి చూపితే వారిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటిస్తామని పాల్ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios