జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ విమర్శలు చేశారు. ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ కూడా డబ్బులు పంచారని కేఏ పాల్‌ ఆరోపించారు. 50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ డిమాండ్ చేశారు. 

ఎన్నికల్లో అవినీతిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తామని కేఏ పాల్‌ స్పష్టం చేశారు. 22 పార్టీలు కలిసి మోదీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేస్తామని కేఏ పాల్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌.. బీజేపీ తరపున ఉంటారా?, కూటమివైపు ఉంటారా? అని కేఏ పాల్‌ ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఇండియా మరో రువాండా, బురిండా అవుతుందని కేఏ పాల్‌ మండిపడ్డారు.