నరసాపురం: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతిపార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ను అమెరికా చేస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేఏ పాల్ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చే అవినీతి సొమ్మును తీసుకోవాలని కానీ ఓటు మాత్రం ప్రజాశాంతి పార్టీకే వెయ్యాలని కోరారు. 

మరోవైపు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు వాయిదా వేసేలా కోర్టులో పిటిషన్‌ వేయాలని వైసీపీకి సూచించారు. తమ పార్టీకి చెందిన 38 మంది అభ్యర్థులను టీడీపీ పెట్టిందంటూ వైసీపీ ఆరోపిస్తోందన్నారు. ఆ విషయంలో వైసీపీ తమతో కలిసి ఎన్నికల వాయిదాకు కోర్టులో ఫిర్యాదు చేసేందుకు రావాలని కేఏ పాల్ కోరారు.