ఏపీ ఎన్నికలపై ఆదివారం ఎగ్జిట్ పోల్స్ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ... వైసీపీకే పట్టం కట్టాయి. ఒకటి రెండు మాత్రమే టీడీకి అనుకూలంగా చెప్పాయి. ఇక జనసేన అయితే... పత్తాలేదు. జనసేన కేవలం ఒకటి, రెండు సీట్లకు మాత్రమే పరిమితమౌతుందని సర్వేలు చెబుతున్నాయి. కాగా... దీనిపై విశాఖ జనసేన లోక్ సభ అభ్యర్థి, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు.

ఎగ్జిట్ పోల్స్ ని తాను పట్టించుకోనని చెప్పారు.  ఎన్నికల్లో ఓడినా, గెలిచినా ప్రజా సేవలో ఉంటానని తేల్చిచెప్పారు. ఎగ్జిట్ పోల్స్ చూసి అభిమానులు ఆందోళన పడకూడదని సూచించారు.మే 23వ తేదీ వరకు వేచి చూడాలని చెప్పారు.

గెలుపు, ఓటములతో తమకు సంబంధం లేదన్నారు. ఓడినా, గెలిచినా... ప్రజల కోసం పొరాడేందుకు తమ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ప్రభావం తమపై ఎప్పుడూ ఉండదని చెప్పారు.