జనసేన పార్టీలో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. తమకు నచ్చని వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేటలో చోటుచేసుకుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే.. జనసేన అధినేత పవన్.. తమ పార్టీ రాజంపేట అభ్యర్థిగా పత్తిపాటి కుసుమకుమారికి కేటాయించారు. అయితే... ఆమెకు టికెట్ కేటాయించడం పట్ల మొదటి నుంచి పలువురికి నచ్చడం లేదు. ఈ క్రమంలో.. మంగళవారం కుసుమకుమారి పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా పార్టీ ఆఫీసులో అడుగుపెట్టారు.

అయితే.. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె పార్టీ ఆఫీసులోకి అడుగుపెట్టడం కార్యకర్తకు నచ్చలేదు. ఇంతలో ఇక్కడికి రావడానికి నీవెవరంటూ ఆ పార్టీ నాయకు లు వెంకటర మణ వర్గీయులు తీవ్రంగా అడ్డుకున్నారు. కార్యాలయం నుంచి వెళ్లిపోవాలంటూ ఆగ్ర హం వ్యక్తం చేశారు.
 
ఆమె వారికి ఎంత సద్దిచెప్పినా వారు ససేమి రా అన్నారు. ఆమె ఎంత సేపటికి కార్యాల యం నుంచి బయటకు పోకపోవడంతో కార్య కర్తలు కార్యాలయం నుంచి బాయ్‌కాట్‌ చేసి వెళ్లిపోయారు.