ఐదో జాబితాలో నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని అభ్యర్థులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని సైతం ఎంపిక చేశారు పవన్ కళ్యాణ్. అంటే ఐదో జాబితాలో ఐదుగురు పార్లమెంట్ అభ్యర్థులు, 16 అసెంబ్లీ అభ్యర్థులను పవన్ ప్రకటించారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో నామినేషన్ల పర్వం ఊపందుకున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు నాలుగు జాబితాలుగా అభ్యర్థులను ప్రకటించిన పవన్ తాజాగా ఐదో జాబితా విడుదల చేశారు. 

ఐదో జాబితాలో నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఏపీలోని అభ్యర్థులతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని సైతం ఎంపిక చేశారు పవన్ కళ్యాణ్. అంటే ఐదో జాబితాలో ఐదుగురు పార్లమెంట్ అభ్యర్థులు, 16 అసెంబ్లీ అభ్యర్థులను పవన్ ప్రకటించారు.

జనసేన పార్టీ లోక్ సభ అభ్యర్థులు

1. విజయనగరం : ముక్కా శ్రీనివాసరావు
2. కాకినాడ : జ్యోతుల వెంకటేశ్వరరావు 
3. గుంటూరు : బి.శ్రీనివాస్ 
4. నంద్యాల : ఎస్.పి.వై.రెడ్డి 
5. మహబూబాబాద్ (తెలంగాణ) : డా.భూక్యా భాస్కర్ నాయక్ 

జనసేన శాసనసభ అభ్యర్థులు

1. సాలూరు : బోనెల గోవిందమ్మ 

2. పార్వతీపురం : గొంగడ గౌరీ శంకరరావు 

3. చీపురుపల్లి : మైలపల్లి శ్రీనివాసరావు 

4. విజయనగరం: డా.పెదమజ్జి హరిబాబు 

5. బొబ్బిలి : గిరదా అప్పలస్వామి 

6. పిఠాపురం : మాకినీడు శేషుకుమారి 

7. కొత్తపేట : బండారు శ్రీనివాసరావు 

8. రామచంద్రపురం: పోలిశెట్టి చంద్రశేఖర్ 

9. జగ్గంపేట : పాటంశెట్టి సూర్యచంద్ర రావు 

10. నూజివీడు : బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు 

11. మైలవరం : అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)

12. సత్తెనపల్లి : వై.వెంకటేశ్వర రెడ్డి 

13. పెదకూరపాడు: పుట్టి సామ్రాజ్యం 

14. తిరుపతి : చదలవాడ కృష్ణమూర్తి 

15. శ్రీకాళహస్తి : వినుత నగరం 

16. గుంతకల్లు : మధుసూదన్ గుప్తా

Scroll to load tweet…